రీసెంట్ గా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో కాస్త హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. జక్కన్న కూడా అప్సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలీతో సరదాగా షోలో విజయేంద్రప్రసాద్ RRRపై మంచి విషయాలే చెప్పారు. ముఖ్యంగా అందరి కంటే అలియా భట్ పాత్ర హైలెట్ అని చెప్పడం అందరిని షాక్ కు గురి చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవ్ గన్ లాంటి హీరోల పాత్రల గురించి కూడా ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. అలాగే RRRలో ఎమోషనల్ ఫైట్ సీన్ పై కూడా లీక్ చేసేశారు. ఇది పక్కా జక్కన్న ప్లాన్ అని తెలుస్తోంది.
ఎందుకంటే ఇటీవల రామ్ చరణ్ - ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మిడియాలోనే ఒక రేంజ్ లో నెగిటివ్ ట్యాగ్స్ ను నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేశారు. ఇక సడన్ గా రామ్ చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఫైట్ చూస్తే ఇంకా ఏ రేంజ్ లో ఫీల్ అవుతారో అని ముందుగానే ఎమోషనల్ ఫైట్ ఉంటుందని ఒక రకంగా మెల్లగా ఇంజెక్షన్ ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి ఎలాంటి విషయాన్ని కూడా బయటకు చెప్పకూడదని అనుకుంటాడు. ఎవరిని కూడా చెప్పనివ్వడు. ఇక విజయేంద్రప్రసాద్ అంత క్లారిటీగా చెప్పారు అంటే ముందు నుంచే ఫ్యాన్స్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు అనుమానం వస్తోంది. ఒక రకంగా ఇది మంచి విషయమే అని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment