దర్శకధీరుడు రాజమౌళి అభిమానుల్లో అంచనాలను ఏ స్థాయిలో క్రియేట్ చేస్తాడో అదే తరహాలో ఆ అంచనాలను అందుకుంటాడు కూడా. ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా డిజైన్ చేస్తాడు. అయితే RRR అనంతరం జక్కన్న స్థాయి మరో లెవెల్ కు వెళ్లడం కాయం. ఇక కొడుకు హాలివుడ్ ఎంట్రీ కోసం తండ్రి విజయేంద్రప్రసాద్ స్టోరీ కూడా సిద్ధం చేసినట్లు క్లారిటీ ఇచ్చేశారు.
ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి రాజమౌళి సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రైటర్ కె.విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. స్టోరీ కూడా సిద్ధం చేసి ఉంచినట్లు చెప్పేశారు. అయితే ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ సినిమా కూడా ఇండియన్ స్టైల్ లోనే ఉంటుందట. RRR అనంతరం మహేష్, ప్రభాస్ వంటి వారిని లైన్ లో పెట్టిన జక్కన్న ఆ హాలీవుడ్ మూవీని ఎవరితో తీస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment