Radhe Shyam: 26 సెట్లకు అన్ని కోట్లా?


టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన రాదేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు గాని సినిమాపై క్రియేట్ చేస్తున్న బజ్ మాత్రం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మొత్తంగా 26 సెట్లను నిర్మించారని టాక్ వస్తోంది. గతంలో ఏ తెలుగు సినిమాకు కూడా ఈ స్థాయిలో భారీగా ఖర్చు చేసి సెట్స్ ను నిర్మించలేదట.

ఇక 26 సెట్ల కోసం మొత్తంగా రూ.106కోట్లకు పైగా ఖర్చు  చేసినట్లు సమాచారం. మొదట సినిమాను 150కోట్లతోనే పూర్తి చేయాలని అనుకున్న యూవీ ప్లాన్ ఆ తరువాత 250కోట్లను దాటించేసింది. సాహో విషయంలో ఎలా అయితే జరిగిందో రాదేశ్యామ్ విషయంలో కూడా అలానే చేస్తున్నారు. రొమాంటిక్ అడ్వెంచర్ లవ్ స్టోరీగా రానున్న ఈ సినిమాపై యూవీ టీమ్ ఎంతవరకు నమ్మకంతో ఉన్నారో తెలియదు గాని అభిమానులకు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో నమ్మకం కలగడం లేదు. అప్డేట్స్ ఇవ్వడంలో చిత్ర యూనిట్ ఏ మాత్రం కరెక్ట్ గా లేదని అసంతృప్తితో ఉన్నారు.


Post a Comment

Previous Post Next Post