బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా RRR ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని ఆ సినిమా క్రియేట్ చేస్తున్న బజ్ మాత్రం అంతా ఇంతా కాదు. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడం వలన సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే కరోనా వలన సినిమా విడుదలపై సస్పెన్స్ విడడం లేదు. అక్టోబర్ లో వచ్చే అవకాశం అయితే లేదు. ఇక త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్న జక్కన్న టీమ్ మొదట హీరోల పాటపైనే ఫోకస్ పెట్టనున్నారట. రామ్ చరణ్, తారక్ కాంబినేషన్ లో ఉండే హై వోల్టేజ్ సాంగ్ బిగ్ స్క్రీన్ పై విజువల్ ట్రీట్ ఇస్తుందని టాక్ వస్తోంది. పాట అనంతరం మరికొన్ని చిన్న చిన్న సీన్స్ ఫినిష్ చేస్తే షూటింగ్ మొత్తం అయిపోయినట్లే. ఇక వచ్చే ఏప్రిల్ లో సినిమా రావచ్చని అంటున్నారు గాని పరిస్థితులు అనుకూలిస్తే తప్ప ఆ టైమ్ కు కూడా సినిమా రాకపోవచ్చని తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment