టాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ దర్శకుల్లో ఒకరైన రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా ఒకప్పుడు ఓ వర్గం ప్రేక్షకులు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపేవారు. కానీ ప్రస్తుతం ఆయన తీస్తున్న సినిమాలు ఏవరు అంతగా పట్టించుకోవడం లేదు. ఆ విషయాన్ని వర్మ కూడా పట్టించుకోకుండానే సినిమాలు తీస్తున్నాడు. దీంతో సినిమాలు రిలీజ్ అయినట్లు కూడా జనాలకు సరిగ్గా తెలియడం లేదు.
ఇక రామ్ గోపాల్ వర్మ స్టార్ హీరోలను టచ్ చేసి చాలా కాలమయ్యింది. చివరగా నాగార్జునతో ఆఫీసర్ అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి అమితాబ్ బచ్చన్ తో వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. సర్కార్ సీరీస్ తో పాటు డిపార్ట్మెంట్ వంటి సిరియాస్ సినిమాలు చేసిన వర్మ మరోసారి అలాంటి తరహాలోనే మరొక కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్ నిజంగా సెట్టవుతుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment