అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. పుష్పలో విలన్ గా ఫాహాద్ ఫజిల్ కనిపిస్తాడని క్లారిటీ ఇచ్చారు. అయితే రెండు భాగాలుగా అనుకున్న తరువాత సుకుమార్ మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఫస్ట్ పార్ట్ లో విలన్ ను చంపేసి సెకండ్ పార్ట్ లో అంతకు మించి అనేలా పవర్ఫుల్ విలన్ ను సెట్ చేస్తారట. ఇక టైటిల్ విషయంలో కూడా కాస్త కొత్తగా ఆలోచించాలని చూస్తున్నారు. ఎదో రన్ టైమ్ ఎక్కువ అవుతోందని రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన ఇప్పుడు మరింత పెద్దదిగా మారుతోంది. మరి సుకుమార్ సెకండ్ పార్ట్ తో అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment