ప్రభాస్ డార్లింగ్ కాంబో.. నిజమెంత?


ప్రభాస్ అనగానే అందరికి గుర్తొచ్చేది డార్లింగ్ అనే పేరు. తన ఊత పధంగా అందరిని ప్రేమగా పిలిచే ప్రభాస్ అందరి నుంచి కూడా అదే ప్రేమను పొందుతున్నాడు. ఇక రెబల్ స్టార్ కెరీర్ లో మంచి బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన డార్లింగ్ కాంబినేషన్ మరోసారి సెట్స్ పైకి రానున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

తొలిప్రేమ దర్శకుడు ఏ.కరుణాకరన్ ప్రభాస్ తో డార్లింగ్ చేసిన తరువాత ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. ఆ తరువాత ఎందుకంటే ప్రేమంట, చిన్నదాన నీకోసం, తేజ్ ఐ లవ్ యూ.. సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. అయితే ఇటీవల ఆ దర్శకుడికి ప్రభాస్ నుంచి పిలుపు వచ్చిందట. మరొక టాక్ ప్రకారం ప్రభాస్ యూవీ క్రియేషన్స్ లో అతనికి ఛాన్స్ ఇప్పించేందుకు మాత్రమే పిలిపించారట. కుదిరితే సంతోష్ శోభన్ కోసం స్టోరీ సెట్ చేయమని కూడా చెప్పినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post