రాజమౌళి తరువాత ఆ స్థాయిలో పాన్ ఇండియా దర్శకుడిగా క్రేజ్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక KGF 2తో అంతకుమించి అనేలా హిట్స్ అందుకోవడానికి కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక ఈ పాన్ ఇండియా దర్శకుడి నుంచి రాబోయే బిగ్గెస్ట్ సినిమాల లైనప్ మరింత పవర్ఫుల్ గా ఉంది. KGF 2 విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ సలార్ వచ్చే సమ్మర్ కు రానుంది. ఎన్టీఆర్ 31- మైత్రి మూవీ కాంబినేషన్. అల్లు అర్జున్ - గీతా ఆర్ట్స్. అలాగే ప్రభాస్ - దిల్ రాజు బ్యానర్ లో కూడా సినిమా ఉంటుందని సమాచారం. ప్రభాస్ కుదరకపోతే మరొక హీరోను కూడా సెట్ చేయడానికి దిల్ రాజు సిద్ధంగా ఉన్నాడట. డీవీవీ దానయ్య, రాంచరణ్ తో కూడా ఒక మూవీ ఉండొచ్చు, మరి ఈ లైనప్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment