పాడుతా తీయగా.. వాళ్ళ చేతుల్లోకి.. !


తెలుగు సంగీతానికి అద్దం పట్టేలా ఉండే ఏకైక మ్యూజిక్ షో పాడుతా తీయగా. గాన గంధర్వులు ఎస్పీ.బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రెండు దశాబ్దాలకు పైగా వియజయవంతంగా కొనసాగింది. మాద్యలో షోకి రేటింగ్స్ అనుకున్నంతగా రాకపోయినా కూడా రామోజీరావు కేవలం తెలుగు సంగీతం మీద అలాగే బాలు గారి మీద అభిమానంతోనే కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఇక SPB మరణం తరువాత ఆ షోకి న్యాయ నిర్ణేత ఎవరు అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. నిజానికి బాలు గారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరనే చెప్పాలి. ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం పాడుతా తీయగా వేడుకను మళ్ళీ స్టార్ట్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలు గారి స్థానంలో అయన తనయుడు SP చరణ్ , అలాగే గాయని సునీత, పాటల రచయిత చంద్రబోస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post