ఆఫర్లు ఎన్ని వచ్చిన తగ్గడం లేదు.. రిజెక్ట్ చేస్తున్న నవీన్ పొలిశెట్టి!


సాధారణంగా ఒక సినిమా హిట్టయితే నేటితరం యువ హీరోలు వెంటవెంటనే ట్రాక్ లోకి రావాలని వచ్చిన ఆఫర్స్ ను వెంటవెంటనే ఓకే చేస్తుంటారు. కానీ జాతిరత్నాలు లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం నవీన్ పొలిశెట్టి మాత్రం ఆ ఫ్లోను కంటిన్యూ చేయడం లేదు. దాదాపు 10 ఏళ్ళ కష్టానికి దక్కిన ఫలితాన్ని మళ్ళీ తొందరపాటు నిర్ణయాలతో పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. 

అందుకే ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా నమ్మకంగా అనిపించిన తరువాతే ఓకే చెప్పాలని అనుకుంటున్నాడట. జాతిరత్నాలు హిట్టయిన తరువాత నవీన్ కు దాదాపు 15 ఆఫర్స్ వచ్చయట. అందులో బడా ప్రొడ్యూసర్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయట. అయినప్పటికీ నవీన్ తొందరపడటం లేదు. నచ్చకపోతే రిజెక్ట్ చేసేస్తున్నాడట. ఇక యూవీ క్రియేషన్స్ లో ఇప్పటికే మహేష్ దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేశాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాపై త్వరలోనే క్లారిటీ రానుంది. 40 ఏళ్ళ వయసు పైబడిన మహిళతో పాతికేళ్ల కుర్రాడి లవ్ స్టొరీ లైన్ తో ఆ సినిమా తెరకెక్కనుందట. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Post a Comment

Previous Post Next Post