జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కోసం హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకుంటున్న కియరా అద్వానీ అయితే బెటర్ అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారట. కొరటాల శివ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కీయరా ఆ తరువాత వినయ విధేయ రామతో డిజాస్టర్ అందుకుంది.
అయినప్పటికీ ఆమెకు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఆమెను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా కోసం 3కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో కూడా గతకొంత కాలంగా మంచి హిట్స్ అందుకుంటున్న కియరా ఈ పాన్ ఇండియా సినిమాకు తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఆచార్య అనంతరం కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు.
Follow @TBO_Updates
Post a Comment