బావమరిదిని దారిలోకి తెస్తున్న ఎన్టీఆర్!


నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఒక విధంగా తన సొంత టాలెంట్ తోనే స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్నాడని చెప్పవచ్చు. ఎన్నో ఆటుపోట్లను చూసి తాతకు తగ్గ మానవడు అనిపించుకున్నాడు. హార్డ్ వర్క్ చేశాడు కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ బావమరిది కూడా త్వరలో హీరోగా రాబోతున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇవ్వాలని విదేశాల్లో కూడా కోచింగ్ తీసుకున్నాడు. అయితే దానికంటే ఎక్కువగా ఈ లాక్ డౌన్ లో బావ ఎన్టీఆర్ ఇంట్లోనే ఉంటూ అంతకంటే ఎక్కువగా నెర్చుకున్నట్లు తెలుస్తోంది. అసలైతే చిత్రం సీక్వెల్ లో నితిన్ హీరోగా అనుకున్నప్పటికి ఎందుకో ఎన్టీఆర్ కు ఆ కథ నచ్చలేదట. ఇక రీసెంట్ గా ఒక దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో నితిన్ కు ఫిక్స్ చేసినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post