జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. RRR తరువాత కొరటాల శివతో మరో సినిమా చేయబోతున్న తారక్ ఆ తరువాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో హై వోల్టేజ్ సినిమాను సెట్స్ పైకి తీసుకు రానున్నాడు. మరోవైపు బుచ్చిబాబు కూడా రెడీ అవుతున్నాడు.
ఇక ఈ బిజీ షెడ్యూల్ లో తారక్ తో మరొక కొత్త సినిమా అంటే కనీసం రెండేళ్లయినా వేయిట్ చేయక తప్పదు. ఇక గత ఏడాది నుంచి అట్లీ, తారక్ కోసం బాగానే ట్రై చేశాడు గాని వర్కౌట్ కాలేదు. మరోసారి ట్రై చేద్దామని ఇటీవల అనుకున్నాడట. కానీ వెంటవెంటనే సినిమాలు ఎనౌన్స్ చేయడంతో మాట్లాడి లాభం లేదని డ్రాప్ అయ్యాడట. ఇక అతను మరోసారి బాలీవుడ్ లోకి వెళ్లి షారుక్ తో సినిమాను సెట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ షారుక్ మాత్రం అట్లీ కథపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈసారైనా ఒప్పుకుంటాడో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment