జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల RRR కు సంబంధించిన ఒక లుక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ లుక్ అభిమానులను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వలన రాజమౌళి లుక్ రిలీజ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని కామెంట్స్ వచ్చాయి.
ఇక జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక జూన్ 15న ఒక అప్డేట్ రావచ్చని టాక్ అయితే వినిపిస్తోంది. ఆ రోజు కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టాక్ వైరల్ అవుతున్నా కూడా అంత ఈజీగా నమ్మలేము. మరి ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment