జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విదంగా వరుసగా మూడు సినిమాలను లైన్ లో ఉంచాడు. RRR అనంతరం కొరటాల శివ సినిమాతో రాబోతున్న తారక్ ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఆ రెండు సినిమాల తరువాత బుచ్చిబాబుతో ఉంటుందని ఇప్పటికే జనాలు ఒక క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టినరోజు బుచ్చిబాబు లోకల్ కథనే గ్లోబల్ కథగా తీర్చిదిద్దనున్నట్లు వివరణ ఇచ్చాడు. కానీ నిజానికి తారక్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కేవలం మెయిన్ లైన్ మాత్రమే విని బావుందని చెప్పాడట. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసిన తరువాతే ప్రాజెక్టుపై ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. మరి బుచ్చిబాబు రెండవ కథను ఏ తరహాలో రెడీ చేసుకుంటాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment