టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీడియం హీరోలతో పాటు అగ్ర తారలు కూడా ఏ మాత్రం బేధాలు చూపకుండా కథ కరెక్ట్ గా ఉంటే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు మరో మల్టీస్టారర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు ఏఆర్.మురగదాస్ ఇటీవల ఒక కథ వినిపించగా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్ లో స్పైడర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే కానీ ఆ సినిమా దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఇక ఈసారి మురగదాస్ కమల్ హాసన్ - మహేష్ బాబు కోసం ఒక పవర్ఫుల్ మల్టీస్టారర్ కథను సెట్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment