టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రయోగాలకు చాలా దూరంగా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. సినిమా రిస్క్ లో పెట్టడానికి ఏ మాత్రం ఇష్టపడడు. అయితే మంచి నమ్మకమైన కథలు వస్తే ఎలాంటి ప్రయోగమైనా చేయడానికి సిద్ధాంగా ఉంటాడు. ఇక మహేష్ ఒప్పుకుంటే ప్రతాపరుద్రుడు కథ సెట్స్ పైకి రావడం కాయమని తెలుస్తోంది.
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయలని దర్శకుడు గుణశేఖర్ చాలా ఆశపడుతూ ఉంటాడు. రుద్రమదేవిని బాగానే ప్రజెంట్ చేసినప్పటికీ ఎందుకో ఆ సినిమా కమర్షియల్ గా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక మహేష్ తో ఒక్కడు , అర్జున్, సైనికుడు లాంటి సినిమాలు తీసిన గుణశేఖర్ మరో సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడట. ప్రతాపరుద్రుడు కథ మహేష్ కు కరెక్ట్ గా సెట్టయ్యేలా రెడీ చేసుకున్నాడట. ఇక ప్రస్తుతం ఆయన సమంతతో శాకుంతలం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రానాతో కూడా హిరణ్యకశిపను చేయాలి. ఆ రెండు హిట్టయితే గుణశేఖర్ మహేష్ ప్రాజెక్ట్ ఈజీగా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.
Follow @TBO_Updates
Post a Comment