సెట్టయితే.. ఆగస్టులో 4 మంచి సినిమాలు!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ ఆకలితో వెయిట్ చేస్తున్న సినిమాల సంఖ్య గట్టిగానే ఉంది. జూన్ నుంచి షూటింగ్స్ మొదలైతే మళ్ళీ ఆ సంఖ్య మరింత ఎక్కువ కావచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జూలైలో థియేటర్స్ ఓపెన్ కావచ్చని టాక్ వస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. ఒకవేళ కరోనా అదుపులోకి వచ్చి అంతా సెట్టయితే ఆగస్టులోనే 4 మంచి సినిమాలు రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. లవ్ స్టొరీ, సీటీమార్, విరాటపర్వం, టక్ జగదీష్ వంటి సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా పోటాపోటీగా రిలీజ్ కావచ్చని సమాచారం. అలాగే పాగల్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నప్పటికీ ఆ సినిమాలు సోలోగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.


Post a Comment

Previous Post Next Post