రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్!


నటుడు, చిత్ర సమీక్షకుడు మరియు బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్ కత్తి మహేష్ ఈ ఉదయం కారు ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. నెల్లూరులోని చంద్రశేఖరపురం హైవేపై మహేష్ కారు అతి వేగం వలన అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో మహేష్‌కు మొహానికి స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స కోసం నెల్లూరు వైద్య ఆసుపత్రికి తరలించినట్లు మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ హైలెట్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా నిత్యం వివిధ కాంట్రావర్సీలకు తెరలేపుతూ వచ్చారు. ప్రస్తుతం నటుడిగా కూడా కత్తి మహేష్ మంచి ఛాన్సులు అందుకుంటున్నాడు.


Post a Comment

Previous Post Next Post