సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా నిలదొక్కుకోవాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సరైన రోల్స్ పడకపోతే వర్కౌట్ కాదని మరొకసారి రుజువయ్యింది. సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
ఆమె నాగచైతన్యతో చేసిన మొదటి సినిమా జోష్ డిజాస్టర్ అయ్యింది. అప్పుడు పెద్దగా ఛాన్సులు రాలేదు. రెండేళ్ల అనంతరం రంగం సినిమాలో ఛాన్స్ అందుకొని బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత తమిళ్ తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక 2017లో చివరగా ఒక హిందీ సీరియల్ లో నటించిన కార్తీక 28 ఏళ్ళ వయసులో నటనకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఆమె కేరళలోని కొన్ని హోటల్స్ ను కొనసాగిస్తూ కొత్త బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment