ఓటీటీ మార్కెట్ గత ఏడాది నుంచి ఇండస్ట్రీలో మరింత ఎక్కువవుతోంది. ఇప్పుడు కొత్తగా విభిన్నంగా ఆలోచించేవారికి ఓటీటీ అనేది ప్రత్యేకమైన ఫ్లాట్ ఫార్మ్ గా నిలుస్తోంది. ఇక అగ్ర దర్శకులు సైతం వారు చేయలేని చిన్న తరహా కథలను ఓటీటీ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాటితోనే శిష్యులను కూడా దర్శకులుగా పరిచయం చేస్తున్నారు.
ఇప్పటికే సుకుమార్ నుంచి కొందరు యువ దర్శకులు ఓటీటీ సినిమాలకు రెడీ అవ్వగా ఇప్పుడు హరీష్ శంకర్ కూడా కథలను అందించి ఓటీటీలో రిలీజ్ చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ కూడా స్టార్ట్ చేయవచ్చని టాక్ అయితే వస్తోంది. అల్లు అరవింద్ ఆహా యప్ ద్వారా సపోర్ట్ కూడా అందుతున్నట్లు సమాచారం. ఇక హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించవచ్చని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment