దేవి శ్రీ ప్రసాద్ 100వ చిత్రం.. బిగ్ రికార్డ్!!


ఒక సినిమా సక్సెస్ కావాలి అంటే ముందు మ్యూజిక్ భారీ స్థాయిలో హిట్టయితేనే జనాలు ఫోకస్ పెడతారు. ఇక తను పని చేసిన ప్రతి సినిమాకు అలానే ఫోకస్ చేయడం దేవిశ్రీప్రసాద్ కు వెన్నతో పెట్టిన విద్య. 1999లో  దేవి సినిమాతో మొదలైన అతని ప్రయాణం ఇంకా అలానే కొనసాగుతోంది. ఇటీవల సెంచరీ కూడా కొట్టేశాడు.

కెరీర్ మొదట్లోనే ఇండస్ట్రీని సరికొత్తగా ఆకర్షించాడు. ఆనందం, కలుసుకోవాలని, ఆర్య, మన్మథుడు, ఖడ్గం, శంకర్ దాదా MBBS, బొమ్మరిల్లు, జల్సా.. ఇలా ఎన్నో సినిమాలతో ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేసుకుంటూ వచ్చిన దేవిశ్రీప్రసాద్ ఇటీవల 100వ మార్క్ ను టచ్ చేశాడు. రవితేజ చేస్తున్న ఖిలాడి సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న రాక్ స్టార్ ఈ అల్బమ్ తో సెంచరీ కొట్టేయడం వైరల్ గా మారింది. ఇక రానున్న రోజుల్లో పుష్పతో అతని సరికొత్త ప్రయాణం మొదలు కానున్నట్లు చెప్పవచ్చు.


Post a Comment

Previous Post Next Post