తెలివైన దగ్గుబాటి నిర్మాతకు టోకరా!


టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత సీనియర్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు డబ్బుల విషయంలో చాలా పొదుపుగా ఉంటారని అందరికి తెలిసిందే. అయితే ఆయనకు ఒక వ్యక్తి షాక్ ఇచ్చి లక్ష రూపాయలు టోకరా వేశారు. దీంతో సురేష్ బాబు చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.

దగ్గుబాటి సురేష్ బాబుకు ఇటీవల నాగార్జున రెడ్డి అనే ఒక వ్యక్తి  ఫోన్ చేసి కొంతమంది ప్రముఖుల పేర్లతో పరిచయం పెంచుకున్నాడు. అయితే లక్ష రూపాయలకు 500 వ్యాక్సిన్ డోసులు ఇప్పిస్తానని చెప్పాడట. దీంతో స్టాఫ్ అందరికి ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలని అనుకున్న సురేష్ బాబు తొందరపడి అతనికి లక్ష రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేశాడు. అయితే ఆ వ్యక్తి డబ్బులు అందిన తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. చివరికి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో సురేష్ బాబు జూబ్లీహిల్స్ పొలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post