వైఎస్. జగన్ ను కలవబోతున్న మెగాస్టార్!


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ కి సమస్యలు వచ్చినప్పుడు నాయకులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కరెక్ట్ గా వకీల్ సాబ్ రిలీజ్ టైమ్ లో టికెట్స్ ప్రైసింగ్, బెన్ఫిట్ షోలకు సంబంధించిన విషయాల్లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడిన విషయం తెలిసిందే. ఇక రానున్న పెద్ద సినిమాలకు కూడా అదే రూల్ కంటిన్యూ కావచ్చని తెలుస్తోంది. అయితే ఆ విషయంపై మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మరికొందరు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి చర్చించనున్నారు. మరి చర్చల అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post