బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా బిగ్ స్క్రీన్ పై హై రేంజ్ లో కనిపిస్తుంది. మేకింగ్ లో అతని సినిమాల కోసం పెట్టె బడ్జెట్ మామూలుగా ఉండదు. నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యాక్ గ్రౌండ్లో ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా భారీ సినిమాలు రూపొందుతుంటాయి. ఇక త్వరలో ఈ హీరో ఛత్రపతి రీమేక్ తో రాబోతున్న విషయం తెలిసిందే.
ఎలాగైనా హిందీలో క్లిక్కవ్వాలని వివి.వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి కథను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇక షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఈ మధ్య హైదరాబాద్ లోనే మూడు కోట్ల ఖర్చుతో ఒక సెట్ ను నిర్మించగా ప్లాన్ డిజాస్టర్ అయ్యింది. వర్షానికి మొత్తం సెట్ పాడైపోయింది. దీంతో మూడు కోట్లకు పైగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ పెన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇక మరోసారి షూటింగ్ స్టార్ట్ చేయడం కోసం మరొక కొత్త సెట్ ను నిర్మిస్తారో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment