బంగార్రాజు కోసం సీనియర్ హీరోయిన్!


అక్కినేని నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. మళ్ళీ అదే ఫార్ములాతో బంగార్రాజు పాత్రతో కొత్త కథను అల్లి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఏడాదికి పైగా కష్టపడి రాసిన స్క్రిప్ట్ నాగార్జున రీసెంట్ గా ఫైనల్ చేశాడు.

ఇక ఆ సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. అంతే కాకుండా ఒక సీనియర్ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు టాక్. ఆమె మరెవరో కాదు 40ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న జయప్రద అని తెలుస్తోంది. ఆమె బంగార్రాజు తల్లి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక సినిమా కథ మొత్తం బంగార్రాజు యంగ్ లైఫ్ అనే పాయింట్ తోనే ఉంటుందట. మరి రమ్యకృష్ణ మరోసారి నాగార్జునతో జత కడుతుందో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post