బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమా రిలీజ్ డేట్ పై మరోసారి చర్చ మొదలైంది. సినిమా షూటింగ్ అయితే తుది దశలో ఉంది. ఫైనల్ షెడ్యూల్ ను వచ్చే నెల పూర్తి చేయాలని దర్శకుడు బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తి వేయడంతో మళ్ళీ రిలీజ్ డేట్స్ పై తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే అందరికంటే ముందుగానే డేట్స్ ఎనౌన్స్ చేసి రిలీజ్ చేయకపోతే అదొక సమస్యలా మారుతుంది. ఎందుకంటే కరోనా వాతావరణం ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు. ఇక అన్ని కుదిరితే వినాయకచవితి సందర్భంగా అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని సమాచారం. బోయపాటి ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment