పుష్పలో ఆ ఫైట్.. నెవర్ బిఫోర్ యాక్షన్ అంట!


ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్పపై మరోసారి అమాంతంగా బజ్ పెరిగింది. ఇటీవల సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఒక్క కామెంట్ తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఒక్క పుష్ప 10 KGF లతో సమానం అనగానే అభిమానుల్లో అంచనాల డోస్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ప్రస్తుతం ఇన్ సైడ్ టాక్ ప్రకారం సినిమాలో ఒక బోట్ ఫైట్ సీన్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట.  ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవరు చూపించని పవర్ఫుల్ యాక్షన్ సీన్ ను చూపించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ టాప్ మోస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో ఆ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడట. సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలి అనుకున్నప్పుడే ఎక్కువ స్పేస్ ను యాక్షన్ సీక్వెన్స్ కోసం వాడుతున్నారని తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post