అల్లు అర్జున్ పుష్ప అనంతరం లైనప్ పెద్దగానే ఉన్నప్పటికీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే పుష్ప అనంతరం 21వ సినిమాను కొరటాల శివతో చేయాల్సింది. కానీ ఎన్టీఆర్ వలన ఆ దర్శకుడు యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో బన్నీ తరువాత సినిమా ఎవరితో అనేది కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది.
వేణు శ్రీరామ్ ఐకాన్ కూడా బన్నీ డైరీలో ఉంది. ప్రశాంత్ నీల్ తో కూడా చర్చలు జరిపారు గాని ఇంకా ఫైనల్ కాలేదు. దానికి ఇంకా టైమ్ ఉంది. ఇక ఇటీవల బోయపాటి , ఏఆర్.మురగదాస్ కూడా కథలు వినిపించారు కానీ బన్నీ ఇంకా ఫైనల్ చేయలేదు. మురగదాస్ కథ రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక వేణు శ్రీరామ్ ఐకాన్ లేదా బోయపాటితో 21వ సినిమా చేయవచ్చని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Follow @TBO_Updates
Post a Comment