టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి రెబల్ స్టార్ కు వంద కోట్లకు తక్కువ ఇవ్వడం లేదు. ఇక ఆ తరువాత ఎవరికి ఎంత వస్తుంది అని విషయంలో ఇంకా సరైన క్లారిటీ లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు సినిమాల రేంజ్ ను బట్టి డిమాండ్ చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప సినిమాకు 35కోట్లకు పైగా అందుకుంటున్న బన్నీ రెండు భాగాలకు కలిపి 70కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడు. ఐకాన్ తో పాటు మురగదాస్, బోయపాటి, కొరటాల వంటి వారి సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. ఆ విధంగా చూసుకుంటే ఈ ఆరు సినిమాలతో మొత్తంగా 200కోట్లకు పైగానే ఆదాయం అందుకోనున్నట్లు టాక్ వస్తోంది. ఒకవేళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఆదాయాన్ని అందుకుంటే అందులో షేర్ కూడా రవచ్చని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment