అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి హిట్టు కోసం ఎంతగా కష్టపడుతున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతని ఆశలన్నీ కూడా ఎక్కువగా సురేందర్ రెడ్డిపైనే ఉన్నాయి. ఏజెంట్ సినిమా ఫుల్ యాక్షన్ ఏంటర్టైనర్ గా రాబోతోంది. ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెడుతున్నారు. అఖిల్ కూడా తన ఫిట్నెస్ అండ్ స్టైల్ ను కూడా మార్చేశాడు. అభిమానుల్లో కూడా అంచనాలు గట్టిగానే పెరిగాయి.
ఆ సినిమా హిట్టవుతుందని ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ వైరల్ అవ్వడంతో మైత్రి మూవీ మేకర్స్ పోటీపడి అఖిల్ తో కమిట్మెంట్ తీసుకుంది. ఏజెంట్ అనంతరం తమతోనే సినిమా చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఏజెంట్ పూర్తయ్యే లోపు మంచి కథను సెట్ చేస్తామని కూడా చెప్పారట. అయితే ఒక టాక్ ప్రకారం మళ్ళీ రొమాంటిక్ కథనే చేయవచ్చని టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజము తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment