రానా దగ్గుబాటి బాహుబలి అనంతరం మళ్ళీ ఆ స్థాయిలో క్రేజ్ అందుకునే సినిమాల్లో నటించలేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. అయితే రానా మూడేళ్ళ క్రితం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప అనే కథను విన్న రానా తన హోమ్ ప్రొడక్షన్ లోనే చేయాలని అనుకున్నాడు.
నిర్మాతగా సురేష్ బాబు కూడా రెడీ అనడమే కాకుండా ఆ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేలా తెరకెక్కించాలని అనుకున్నారు. 200కోట్ల వరకు బడ్జెట్ కూడా అనుకున్నారు. కానీ ఆ సినిమాకు సరైన ప్లాన్ సెట్టవ్వక ఇంకా మొదలు కాలేదు. పైగా ఎదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అప్పట్లో రానా డేట్స్ దొరక్కపోవడం ఇప్పుడు కరోనా దెబ్బ కొట్టడం వలన వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఆ సినిమా ఆగిపోయినట్లే అనే టాక్ రావడంతో అందులో నిజం లేదని దర్శకుడు గుణశేఖర్ క్లారిటీ ఇచ్చేశారు. తాను చేస్తున్న శాకుంతలం సినిమా అనంతరం హిరణ్యకశిప ఉంటుందని చెప్పారు.
Follow @TBO_Updates
Post a Comment