వంశీ పైడిపల్లి సినిమాలు కమర్షియల్ కొన్ని బాగానే ఆడినా ఆ సినిమాలు రెండవ సారి చూసేంత మ్యాటర్ ఉండదని హీరోల అభిమానులే నుంచే కామెంట్స్ వస్తుంటాయి. ఆయన సెలెక్ట్ చేసుకునే కాన్సెప్ట్స్ కొత్తగానే ఉంటాయి గాని మేకింగ్ మాత్రం చాలా రొటీన్ అనేది అందరికి తెలిసిన విషయమే. మహర్షి తరువాత మరో సినిమా అనగానే మహేష్ ఫ్యాన్స్ వద్దు బాబోయ్ అంటూ కంగారు పడ్డారు.
ఇక పవన్ కళ్యాణ్, మెగాస్టార్ తో అంటూ రూమర్స్ బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్ విజయ్ తో సినిమా సెట్టయినట్లు టాక్ వస్తోంది. దిల్ రాజు ద్వారా ఒకే అయినట్లు టాక్. బహుశా విజయ్ ఎలాగోలా తెలుగు అభిమానుల సంఖ్యను కూడా పెంచుకోవాలనే ఆలోచనతో ఒకే చెప్పినట్లు ఉన్నాడు కావచ్చు. ఇక కమర్షియల్ దర్శకుడే కాబట్టి ఆయన సినిమాలు చూడకుండానే ఒప్పుకొని ఉంటాడని కామెంట్స్ వస్తున్నాయి.
Follow @TBO_Updates
Post a Comment