సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి స్పీడ్ పెంచబోతున్నాడు. మొత్తానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. నిన్నటి నుంచి గ్యాప్ లేకుండా రూమర్స్ అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సాయంత్రం అప్డేట్ ఇచ్చేశారు.
అతడు, ఖలేజా లాంటి విభిన్నమైన సినిమాల అనంతరం సెట్టయిన ఈ కాంబోపై అంచనాలు అయితే మాములుగా లేవు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు. ఇక సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment