Keerthy Suresh Opens up on Her Marriage!


మహానటి సినిమాతో సౌత్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బడా సినిమాల్లో ఛాన్సులు అందుకుంటోంది. ఇక సినిమాలతో పాటు ఆమె వెంట అనేక రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమ పెళ్లి అంటూ గాసిప్స్ చాలానే వచ్చాయి.

ఇక అందులో నిజం లేదని ఇంట్లో వాళ్ళు కొట్టిపారేశారు. ఇక ఫైనల్ గా అమ్మడు ఇటీవల మరొక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపై మాత్రమే ఉందని ఒకవేళ పెళ్లి అనే తతంగం వస్తే నేనే స్వయంగా అభిమానులకు, ఫాలోవర్స్ కు అందరికి తెలియజేస్తాను అని కుండబద్దలు కొట్టేసింది. ప్రస్తుతం కీర్తి వయసు 28. మరో రెండేళ్ల వరకు ఎలాంటి ఆలోచనలు లేకుండా సినిమాలు చేసుకోవాలని అనుకుంటోంది. ఇక తమిళ్ సినిమాలతో పాటు తెలుగులో మహేష్ బాబుతో  సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post