జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కనున్న ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక హీరోయిన్ విషయంలో ఇటీవల దర్శకుడు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ కు జోడిగా కీయరా అద్వానీ అయితే బావుంటుందని కొరటాల ఆలోచిస్తూ వస్తున్నాడు. ఇదివరకే భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి సినిమాలను చేసిన కీయరా మరో మంచి తెలుగు కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొరటాల చెప్పిన కథ బాగా నచ్చేసిందట. వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. ఇక ఆచార్య పనులన్నీ పూర్తయిన అనంతరం కొరటాల ఎన్టీఆర్ 30వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment