టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పూర్తిగా పాన్ ఇండియా కథలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. RRR ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను సైతం కాదని కొరటల శివతో అప్పటికప్పుడు పాన్ ఇండియా కథను సెట్ చేసుకున్నాడు. RRR వల్ల వచ్చే మార్కెట్ ను ఏ మాత్రం వదులు కోవద్దని డిసైడ్ అయ్యారు.
రామ్ చరణ్ అనే కాదు. అందరూ హీరోలు ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నారు. ఇక ప్రస్తుతం సీనియర్ దర్శకులు బిజీగా ఉండడంతో రామ్ చరణ్ యంగ్ టాలెంటెడ్ దర్శకులను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. శంకర్ ఇండియన్ 2 మళ్ళీ పట్టాలెక్కడంతో చరణ్ వెంటనే మరో సినిమాను మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే యంగ్ డైరెక్టర్లపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. యువ దర్శకులు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ముందుగా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment