కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ F3 సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ తో చేస్తున్న ఆ రెండవ మల్టీస్టారర్ పై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఆ తరువాత అనిల్ మరో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజతో అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోసం ఒక మాస్ కథను రాసుకున్నాడట. చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు బాలయ్యతో చేయాల్సిన సినిమాను కాస్త ఆలస్యంగానే స్టార్ట్ చేయవచ్చని టాక్. ఇక రామ్, రవితేజతో చేయబోయే సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ లోనే చేయవచ్చని తెలుస్తోంది. F3 సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment