రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కు ఈ మధ్య ఆఫర్స్ తగ్గుతున్నాయి అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. రొటీన్ మ్యూజిక్ వలన సాంగ్స్ అంతగా క్లిక్కవడం లేదని కూడా ఉన్నారు. ఇక సుకుమార్ లేదా ఆ టీమ్ నుంచి వచ్చే వారికి మాత్రం అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడాని కూడా ట్రోలింగ్స్ చాలానే వచ్చాయి. ఒక విధంగా అప్పుడప్పుడు దేవి రేంజ్ తగ్గడం థమన్ కు గట్టిగానే హెల్ప్ అవుతోంది.
అయితే దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్ వైపు కూడా ఫోకస్ పెడుతుండడం విశేషం. రోహిత్ శెట్టి, రణ్ వీర్ సింగ్ కాంబినేషన్ లో రాబోతున్న సిర్కస్ అనే సినిమాకు సినిమా కోసం డిఎస్పీ రెండు స్పెషల్ సాంగ్స్ ను కంపోజ్ చేయనున్నట్లు సమాచారం. ఇదివరకే రాధే సినిమా కోసం డీజే సాంగ్ ను మరోసారి కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ కామెడీ సినిమా కోసం ఇంకా ఎలాంటి మాస్ సాంగ్స్ ఇస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment