విమాన ప్రమాదంలో హాలీవుడ్ స్టార్ 'టార్జాన్' కన్నుమూత
1996లో వచ్చిన బిగ్గెస్ట్ అడ్వెంచర్ మూవీ ‘టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్' తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకున్న జో లారా విమాన ప్రమాదంలో మరణించారు. ఒక్కసారిగా సినీ లోకాన్ని షాక్ కు గురి చేసిన ఈ ఘటన టేనస్సీలో చోటుచేసుకుంది. జరిగిన విమాన ప్రమాదంలో అతనితో పాటు, జో లారా భార్య, అమెరికన్ రచయిత, డైటీషియన్ గ్వెన్ షాంబ్లిన్ సహా మరో ఐదుగురు ప్రయాణికులు కూడా మరణించారు.
అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలో ఒక సరస్సులో వారి ప్రైవేట్ జెట్
కూలిపోయినట్లు తెలుస్తోంది. చిన్న బిజినెస్ ప్రైవేట్ జెట్, సెస్నా 501
శనివారం ఉదయం 11:00 గంటలకు ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కోసం స్మిర్నా, టేనస్సీ
విమానాశ్రయం నుండి బయలుదేరింది. అయితే నింగికి ఎగిరిన కొద్దిసేపటికే
నాట్విల్లెకు దక్షిణాన 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెర్సీ ప్రీస్ట్ సరస్సులో
జెట్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ
టీమ్ ఘటన స్థలానికి చేరుకున్నప్పటికి అప్పటికే అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ
ఘటనపై టార్జాన్ ఫ్యాన్స్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Post a Comment