రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అని ముందే ఫిక్స్ అయిపోవచ్చు. సినిమా సెట్స్ పైకి రాకముందే భారీ స్థాయిలో అంచనాలు పెంచేస్తున్నాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం కమిట్మెంట్ ఇచ్చిన హడావుడి చూస్తుంటే ఆరేళ్ళ వరకు మరొక కొత్త సినిమా స్టార్ట్ చేసేలా లేడని అనిపిస్తోంది.
రాధేశ్యామ్ అనంతరం సలార్ తో రానున్న ప్రభాస్ ఆ వెంటనే ఆదిపురుష్ కు ఫీనిషింగ్ టచ్ ఇవ్వనున్నాడు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తుండగా ఆ సినిమా రావడానికి ఇంకా ముడేళ్లకు పైగా సమయం పట్టవచ్చు. ఇక సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో చేయబోయే సినిమా హేవి యాక్షన్ సినిమా కాబట్టి మరో రెండేళ్లు. ఈ విధంగా చూసుకుంటే ప్రభాస్ కు ఇప్పుడు కథ చెబితే షూటింగ్ స్టార్ట్ చేయడానికి మరో 6ఏళ్ళు ఈజీగా టైమ్ పడుతుంది. అప్పటి వరకు ప్రభాస్ చిక్కడు దొరకడు.
Follow @TBO_Updates
Post a Comment