థియేట్రికల్ బిజినెస్ పై ఆశలు పెట్టుకుంటే ఇప్పట్లో తీరనట్లే అని కొంతమంది బడా నిర్మాతలకు క్లారిటీగా అర్ధమయ్యింది. అందుకే కొన్ని సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ డీల్స్ కు అమ్మేస్తున్నారు. ఇక నాని టక్ జగదీష్ సినిమాకు కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. కానీ ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
అయితే గత ఏడాది ఫస్ట్ వేవ్ లో V the movie కూడా వాయిదా పడుతూ వచ్చింది. అప్పట్లో దిల్ రాజు అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి థియేటర్స్ లోనే రానున్నట్లు చెప్పాడు. కానీ చివరికి అమెజాన్ ఆఫర్ కు తలొగ్గక తప్పలేదు. ఇక ఈసారి సెకండ్ వేవ్ హడావుడికి ఈ ఏడాది మొత్తం థియేటర్స్ బిజినెస్ ఫామ్ లోకి వచ్చే అవకాశం లేదని అర్ధమవుతోంది.
ఇక టక్ జగదీష్ కు మరో మార్గం లేదని అనుకుంటున్న తరుణంలో ఓటీటీ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింధి. థియేటర్స్ లో విడుదల చేయాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎదురుచూసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ఆ విషయంలో కఠినంగా ఉంది. టికెట్స్ రేట్స్ విషయంలో కూడా క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు మీడియం బఫ్జెట్ సినిమాలకు కూడా ఓటీటీ మాత్రమే ధిక్కని అర్ధమవుతోంది.
Follow @TBO_Updates
Post a Comment