థియేటర్స్ పై మమకారం ఎంత ఉన్నా కూడా ఇప్పుడు ఓటీటీ మార్కెట్ తక్కువేమి ఉండకపోవడంతో నిర్మాతలు డీల్స్ కు హ్యాపీగా ఒప్పేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓటీటీ సంస్థలు నిర్మాతలకు పెట్టిన పెట్టుడి కంటే కూడా ప్రాఫిట్స్ వచ్చేలానే ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇక మరో సీనియర్ హీరో వారసుడి కొడుకు సినిమాకు కూడా ఓటీటీ ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయట.
సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన మొదటి సినిమా నిర్మలా కాన్వెంట్ అయినప్పటికీ ఇప్పుడు మరోసారి రీలాంచ్ చేస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ డైరెక్ట్ చేసిన పెళ్లి సందడి విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కీరవాణి స్వరపరిచిన రెండు పాటలను కూడా ఇటీవల రిలీజ్ చేయగా బాగానే క్లిక్కయ్యాయి. ఇక ఈ సినిమాకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చే విధంగా ఓటీటీ ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. అయితే నిర్మాతలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. థియేటర్స్ ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీకే వైపై వెళ్లవచ్చని సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment