టాలీవుడ్ టాలంటేడ్ యువ నటులలో సత్యదేవ్ టాప్ లో ఉంటాడనే చెప్పాలి. సరైన సినిమాలు తగలడం లేదు గాని లేకపోతే మనోడి రేంజ్ మరో లెవెల్లో ఉండేది. మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సినిమాల్లో గుర్తింపు లేని హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
అతని కెరీర్ ని మార్చింది మాత్రం పూరి జగన్నాధ్ జ్యోతిలక్ష్మి సినిమానే. ఆ సినిమా హిట్టవ్వకపోయినా కూడా సత్యదేవ్ పాత్రకు మంచి గుర్తింపు లబించింది. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య , ఘాజి వంటి సినిమాలతో తన టాలెంట్ ను మరింత పెంచుకున్నాడు. గతంలో అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో ఒక చిన్న పాత్రలో నటించిన సత్యదేవ్ ఈసారి అక్షయ్ కుమార్ బిగ్ మూవీలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అబిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామసేతు'లో సత్యదేవ పాత్ర చాలా కీలకమట. ఈ సినిమాపై అంచనాలు భారిగానే ఉన్నాయి. మరి సత్యదేవ్ ఏ స్థాయిలో గుర్తింపు అందుకుంటాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment