టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం రాజమౌళి బాహుబలి ద్వారా వచ్చిన క్రేజ్ తోనే RRR అన్ని వైపులా డబ్బులను దండుకుంటోంది. అయితే మరికొందరు RRR బిజినెస్ తో మరొక బిజినెస్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సినిమా ఓటీటీ డిజిటల్ మొత్తం హక్కులకు సంబంధించిన విషయాలను పెన్ స్టూడియోస్ బుధవారం బయటపెట్టింది. పెన్ స్టూడియోస్ హిందీ థియేట్రికల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వారు డిజిటల్ , శాటిలైట్ కొనాల్సిన అవసరం లేకపోయినా కూడా ఒకేసారి అన్ని భాషలకు సంబంధించిన హక్కులను సింగిల్ డీల్ తో క్లోజ్ చేశారు. ఇక ఆ తరువాత వాళ్లు ఆయా భాషలకు, ఏరియాలకు తగ్గట్లు ఇతర ఓటీటీలు, టీవీ ఛానెల్స్ తో ఒప్పందాలు చేసుకొని మరొక కొత్త రేటుకు అమ్ముకున్నారు. అలా విభజించడంతో పెట్టిన పెట్టుబడి కంటే సగానికి పైగా లాభాలు దక్కినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment