టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఎంత కూల్ గా కనిపిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎక్కువగా ప్రయివేట్ లైఫ్ ను ఇష్టపడే అకిరా నందన్ తండ్రిలానే సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. ఇక చాలా కాలం తరువాత అకిరా తండ్రీతో కలిసి సంగీతం నేర్చుకునే పనిలో పడ్డాడు.
అకిరాకు సంగీతం అంటే చాలా ఇష్టమని రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక వయోలిన్ నేర్చుకునేందుకు హైదరాబాద్ కు వచ్చిన అకిరా నందన్ తండ్రీతోనే గత కొన్నిరోజులుగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఒక సీనియర్ వయోలిన్ టీచర్ వద్ద కొడుకుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కలిసి వయోలిన్ నేర్చుకుంటున్నారు. ఇక అకిరా నందన్ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Follow @TBO_Updates
Post a Comment