టాలీవుడ్ ఇండస్ట్రీలో గబ్బర్ సింగ్ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో మరొక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ తో మాట్లాడుతున్న హరీష్ శంకర్ నటీనటుల విషయంలో ఫైనల్ గా ఒక నిర్ణయానికి వస్తున్నట్లు టాక్.
ఇక హీరోయిన్ విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫిల్మ్ నగర్ లో ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే - కీయరా అద్వానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేస్తారని సమాచారం. హరీష్ శంకర్ ఎక్కువగా పూజాపైనే ఫోకస్ పెట్టినట్లు టాక్. ఎందుకంటే ఇదివరకే వీరి కాంబినేషన్ లో డీజే - గద్దల కొండ గణేష్ సినిమాలు వచ్చాయి. మరి పవన్ సినిమాకు కూడా ఆమెనే ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment