NTR - TRIVIKRAM: మొహమాటం లేకుండానే..!


జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్న విషయం. అయితే తారక్ మాత్రం RRR అనంతరం చేయాల్సిన సినిమా అంతకు మించి కాకపోయినా పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లయినా ఉండాలని అనుకున్నాడు. కానీ త్రివిక్రమ్ పక్కా తెలుగు లోకల్ ఫ్లేవర్ లాంటి కథనే పట్టుకొని ఉండడంతో తారక్ మొహమాటం లేకుండానే వద్దని చెప్పేశాడట.

కూల్ గా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినప్పటికీ ఆ విషయంపై అనేక రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. మళ్ళీ ఆ కాంబోలో సినిమా ఉంటుందని కూడా టాక్ వచ్చింది. రీసెంట్ గా తారక్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య నార్మల్ గానే సంభాషణ జరిగినట్లు టాక్ వస్తోంది. వందల కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి ఇద్దరు నమ్మకంతో ఉంటేనే సినిమా చేయాలి. తారక్ ఓపెన్ గా చెప్పిన నిర్ణయాన్ని త్రివిక్రమ్ పెద్దగా నెగిటివ్ గా తీసుకోలేదు. హీరోలతో రిలేషన్ బావుండలని దర్శకులు అనుకున్నట్లుగానే హీరోలు కూడా అనుకుంటారు. కాబట్టి ఈ కాంబోపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.


Post a Comment

Previous Post Next Post