టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితిన్ కమర్షియల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ప్రయోగాలు చేయాలనే ఆశతో చెక్ అనే సినిమా చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. దారుణమైన రిజల్ట్ అందుకోవడంతో రంగ్ దే సినిమాతో హిట్ కొట్టాలని అనుకున్నాడు. అది కూడా తేడా కొట్టేసింది. ఇక ఫైనల్ గా ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని అందాదున్ రీమేక్ మాస్ట్రోతో రెడీ అవుతున్నాడు.
ఆ సినిమా ఎంతవరకు హిట్టవుతుందో తెలియదు గాని ఒక వేళ తేడా కొడితే మాత్రం ముందు జాగ్రత్తగా భీష్మ దర్శకుడిని సెట్ చేసుకుంటున్నాడు. వెంకీ కుడుములను స్టోరీ సెట్ చేయమని నితిన్ ముందుగానే ఆదేశించినట్లు తెలుస్తోంది. వెంకీ కూడా రెండు కథలపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకీ అంతకంటే ముందు మైత్రి మూవీ మేకర్స్ లోనే మరొక హీరోతో సినిమా చేయాల్సి ఉంది. ఆ హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అది సెట్టయితే నితిన్ ప్రాజెక్ట్ పై కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.
Follow @TBO_Updates
Post a Comment