టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి నెగిటివ్ వచ్చినట్లు క్లారిటి ఇచ్చేశారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా రావడంతో అభిమానుల్లో కూడా కాస్త టెన్షన్ మొదలైంది. అయితే ఎవరో ఒకరు ఎప్పటికప్పుడు తారక్ ఆరోగ్యంపై అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గత వారం తారక్ తో మాట్లాడిన విషయం తెలిసిందే.
ఇక ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా క్లారిటి ఇచ్చేశారు. రీసెంట్ గా టెస్ట్ చేయించుకోగా కోవిడ్ 19 నెగిటివ్ వచ్చింది. కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ప్రవీణ్ తో పాటు నా కజిన్ వీరు ఈ కఠిన సమయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు చెప్పారు. కోవిడ్ 19 ను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ జాగ్రత్తతో దైర్యంగా పోరాడితే వ్యాధిని తిప్పి కొట్టవచ్చు., ఈ పోరాటంలో మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి. ఆందోళన పడకండి.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment